నెల్లూరు నగరంలో వైఎస్సార్‌సీపీ నేతలు రాజకీయ డ్రామాలు ఆడుతున్నారంటూ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Nellore: వైసిపీ ఎమ్మెల్సీలు నెల్లూరు నగరంలో రాజకీయ డ్రామా చేశారంటూ మండిపడ్డారు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్. వైసిపీ రాజకీయ డ్రామాతో బాబాసాహెబ్ అంబేద్కర్ కు అంటిన మకిలిని పాలతో కడిగి శుద్ధి చేశామని చెప్పారు. కృష్ణ చైతన్య విద్యా సంస్థలకి ఏం జరిగిందని ఎంఎల్సీలు రాద్ధాంతం చేశారు..? చంద్రశేఖర్ రెడ్డి విద్యాసంస్థలు మూసేశారా? క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపారా…? ఏమీ జరక్కపోయినా… రాజకీయ కక్ష అంటూ సానుభూతి పొందే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కక్ష సాధింపులు అంటే చంద్రశేఖర్ రెడ్డికి తెలుసా ..? మంత్రి నారాయణ ఫ్లెక్సీలు 48 గంటలలోపే తొలగించారని, చంద్రశేఖర్ రెడ్డి ఫ్లెక్సీలు రోజుల తరబడి అట్టే ఉన్నాయని, దీన్ని కక్షసాధింపు అంటారని అన్నారు. నెల్లూరు నగరంలోని అంబేద్కర్ బొమ్మ సాక్షిగా… వైసిపి నేతలు కాకాణి గోవర్ధన్ రెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కలిసి పెద్ద రాజకీయ డ్రామాకు తెరలేపారంటూ.. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. మీ వీధి డ్రామాలకు అభివృద్ధితో సమాధానం చెబుతామని, నారాయణ ది కక్ష సాధించే స్వభావం అయితే… నెల్లూరులో రాజకీయం చేయగలవా చంద్రశేఖర్ రెడ్డి అని ప్రశ్నించారు.. వైఎస్ఆర్సీపీ ఐదేళ్ళ పాలనలో కక్షసాధింపులను దగ్గరుండి చూసా , చీప్ రాజకీయాలు ఇకనైనా మానుకోండి అంటూ హెచ్చరించారు… కృష్ణచైతన్య తో పాటు నారాయణ,భాష్యం స్కూల్స్ కి కూడా నోటీసులు ఇచ్చారు.విద్యా శాఖలో సాధారణంగా జరిగిన తనిఖీలను రాజకీయ స్వార్ధనికి వాడుకుంటున్నారని, దుర్మార్గపు ఆలోచనలతో పొలిటికల్ డ్రామాలు వేస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక, బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలు మీ నీచరాజకీయాలు గమనిస్తున్నారని చెప్పారు. లోకేష్ బాబు మీలా ఆలోచిస్తే కృష్ణ చైతన్య విద్యాసంస్థలు మూతపడేవని, మంత్రి నారాయణ మీ వికృత రాజకీయాలకు అభివృద్ధితోనే సమాధానం చెపుతారని, నెల్లూరు కార్పొరేషన్ మరియు డీలిమిటేషన్ ప్రక్రియ గురించి మాట్లాడే ఈ వైసిపి నేతలకు, అసలు మున్సిపల్ చట్టాలు, వాటి ప్రాతిపదికలు తెలుసా అని అన్నారు. కోర్టు ఏదో స్టే ఇచ్చిందని, ఎగిరెగిరి పడుతున్నారని, తమకు న్యాయస్థానాలపై పూర్తి విశ్వాసం ఉందని, వీటన్నింటికీ కాలమే సమాధానం చెప్తుందన్నారు. నారాయణ పక్షాన నెల్లూరు నగరం మొత్తం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ కపిర శ్రీనివాసులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.


