పున్నమి ప్రతినిధి వేముల (జూలై 27) వేముల:మహిళల ఆర్థిక స్వావలంబనకు సమగ్ర కార్యాచరణ
వేముల మండల మహిళా సమాఖ్య కార్యవర్గ సమావేశంలో ఏపీఎం ఆంజనేయులు
వేముల: వేముల మండల మహిళా సమాఖ్య కార్యవర్గ సమావేశం మండల మహిళా సమాఖ్య అధ్యక్షులు శ్రీమతి శ్రీ లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ సమావేశానికి వెలుగు డీఆర్డీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆంజనేయులు హాజరై మహిళా సంఘాల అభివృద్ధి, ఆర్థిక బలోపేతం, జీవనోపాధులు మరియు మహిళా పారిశ్రామికవేత్తల ప్రోత్సాహం పైన అవగాహనా కల్పించారు.
మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు శ్రీలక్ష్మి, కార్యదర్శి రజిత, కోశాధికారి యమున అధ్యక్షతన జరిగిన సమావేశంలో , కొత్త రుణాల మంజూరు, శ్రీనిధి రుణాలు–రీపేమెంట్, బ్యాంక్ లింకేజీ ప్రగతి, ఉన్నతి రుణాల మంజూరు తదితర అంశాల ప్రగతి సమీక్షించారు.
మహిళలకు కొత్త జీవనోపాధుల కల్పన, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, మహిళలకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం, PMEGP, PMFME పథకాలపై అవగాహన కల్పించడం వంటి అంశాలపై చర్చించారు. సంఘం వ్యవహారాలు తెలుసుకోడానికి “మన డబ్బులు–మన లెక్కలు” కార్యక్రమం, సూపర్ నారీ యాప్ వినియోగ విధానం, లోకోస్ డేటా స్వచ్ఛీకరణ ప్రక్రియపై సభ్యులకు వివరించారు.
లైవ్‌స్టాక్ యూనిట్ల గ్రౌండింగ్, ఇన్సూరెన్స్, జెండర్ రిసోర్స్ సెంటర్ ఏర్పాటు, ఆరోగ్యం–పోషణ, స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం,ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజషన్ కార్యక్రమాలు, కస్టమర్ హైరింగ్ సెంటర్ ఏర్పాటు వంటి అంశాలపై కూడా సమావేశంలో సమగ్రంగా చర్చించారు.
వ్యవసాయ రంగం మరియు సర్వీస్ సెక్టార్లో కొత్త జీవనోపాధుల అభివృద్ధి, సూపర్ ఫంక్షనరీ యాప్ వినియోగం, పనితీరు, సమావేశాల నిర్వహణ, ఆడిట్ 2025–26 అంశాలను సమీక్షించారు. ప్రతి గ్రామ పరిధిలో 20 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు.
యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం, మహిళల ఆర్థిక స్వావలంబనను పెంపొందించడం, స్వయం ఉపాధి అవకాశాలను ప్రోత్సహించడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని వెలుగు డీఆర్డీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆంజనేయులు సూచించారు.
మహిళా సంఘాల ఆర్థిక బలోపేతం, జీవనోపాధుల అభివృద్ధి, మహిళా పారిశ్రామికవేత్తల ప్రోత్సాహం మరియు యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు వేముల మండల మహిళా సమాఖ్య సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో గ్రామసమాఖ్య అధ్యక్షురాలు లు నిర్ణయించారు.కార్యక్రమం లో కమ్యూనిటీ కో ఆర్డినేటర్ లు, అకౌంటెంట్ తదితరులు పాల్గొన్నారు






