పున్నమి న్యూస్ ప్రతినిధి:
వేముల, సెప్టెంబర్ 7: వేముల మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలలో SC, ST, BC వర్గాలకు చెందిన ఓటర్లను గుర్తించి రూపొందించిన తుది ఓటర్ల జాబితాలను సోమవారం (07-09-2026) ప్రచురించారు.
ఎన్నికల ప్రక్రియలో భాగంగా సంబంధిత గ్రామ పంచాయతీల వారీగా గుర్తించిన SC, ST, BC ఓటర్ల వివరాలతో కూడిన తుది జాబితాలను ప్రజల పరిశీలనార్థం అందుబాటులో ఉంచారు.
సంబంధిత అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఎన్నికల నిబంధనల ప్రకారం జాబితాల తయారీ, ప్రచురణ ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలిపారు.



