పున్నమి న్యూస్ ప్రతినిధి:
వేముల, సెప్టెంబర్ 11:
వేముల మండలంలో MPTC, ZPTC ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాలను శుక్రవారం ప్రచురించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈ జాబితాలను మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) కార్యాలయం, మండల రెవెన్యూ కార్యాలయం, అలాగే మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల నోటీసు బోర్డులపై ప్రజల పరిశీలనార్థం అందుబాటులో ఉంచారు.
సంబంధిత ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఇతర ఆసక్తి ఉన్నవారు ఆయా కార్యాలయాలను సందర్శించి ఓటర్ల జాబితాలను పరిశీలించుకోవచ్చని అధికారులు తెలిపారు.


