ఇందిరానగర్లో శ్రీ భద్రాద్రి రామాలయం, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దర్శనం
పున్నమి ప్రతినిధి – శుక్రవారం, సెప్టెంబర్ 11
కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం ఇందిరానగర్లో వెలసిన శ్రీ శ్రీ శ్రీ భద్రాద్రి రామాలయం దేవస్థానం ప్రాంగణంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (APSCPCR) సభ్యురాలు శ్రీమతి KG వెంకట పద్మలత గారు శుక్రవారం దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన శ్రీమతి KG వెంకట పద్మలత గారికి ఆలయ నిర్మాణ దాత ఏటూరు రామ చంద్రారెడ్డి (ARCR) గారు, బండి తిరుమల రావు (BTR) గారు, వారి బృందం ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆమెను గౌరవపూర్వకంగా సత్కరించారు.
ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ విశిష్టత, దేవస్థానంలో కొనసాగుతున్న కార్యక్రమాలు, ఆలయ అభివృద్ధికి చేపడుతున్న చర్యల గురించి ఆలయ ప్రతినిధులు ఆమెకు వివరించారు.
ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ దాత ఏటూరు రామ చంద్రారెడ్డి మాట్లాడుతూ శ్రీమతి KG వెంకట పద్మలత గారు ఆలయానికి విచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆలయానికి వచ్చే ప్రముఖులు, భక్తులకు ఆలయ కమిటీ తరఫున ఎల్లప్పుడూ ఆత్మీయ స్వాగతం పలుకుతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






