నెల్లూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి శ్రీనివాస్ ఆదేశాల ప్రకారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ వై జె పద్మశ్రీ ఆధ్వర్యంలో సోమవారం ప్రపంచ వృద్ధులపై వేధింపుల నివారణ అవగాహన సదస్సు నారాయణరెడ్డిపేట బాపూజీ వృద్ధుల ఆశ్రమం, దోసకాయల దిబ్బ నేతాజీ వృద్ధుల ఆశ్రమం నందు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు .ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సీనియర్ సివిల్ జడ్జి వై జె పద్మశ్రీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూన్ 15న ప్రపంచ వృద్ధుల దుర్వినియోగ అవగాహన దినోత్సవంను ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల హక్కులను పరిరక్షించడం వారిపై జరుగుతున్న వేధింపులు వివక్షత మరియు హింసకు వ్యతిరేకంగా సమాజంలో అవగాహన కల్పించడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశము అని తెలిపారు.
వృద్ధులను ఉద్దేశించి తల్లిదండ్రులను కుటుంబంలోని ఇతర వయోవృద్ధులను వృద్యాప్యంలో నిర్లక్ష్యం చేయడం హేయకరమైన విషయం అని బిడ్డలను పెంచి విద్యాబుద్ధులకు చెప్పించి ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులను వృద్ధులను నిర్లక్ష్యం చేయరాదని చాలామంది నిర్లక్ష్యం చేయటం ఇంటి నుండి బయటకు గెంటి వేయడం జరుగుతుందని ఆవేదన వ్యక్తంచేశారు.. వృద్ధాప్యంలో ఇలాంటి వారి రక్షణ కోసం 2007 సంవత్సరంలో తల్లిదండ్రుల సీనియర్ సిటిజెన్ల పోషణ సంక్షేమ చట్టం అమలులోకి వచ్చింది తల్లిదండ్రుల పోషణ భారం వారి బిడ్డలు మనుమలు, మనుమరాలు లేదా వారి నుండి ఆస్తులను పొందే అవకాశం ఉన్న బంధువులందరికీ అని తెలిపినారు అలాగే మీకు ఆధార్ కార్డ్స్ రేషన్ కార్డ్స్ లేని వారికి మాకు తెలిపితే మేము పై అధికారులకు తెలిపి మీకు వచ్చేటట్లు చేస్తామని తెలిపినారు అలాగే వాళ్లకు అందుతున్న భోజనం వసతులు వసతి గృహం బాత్రూమ్స్ వైద్య సదుపాయం గురించి అన్ని విషయాలు వివరంగా అడిగి తెలుసుకున్నారు తదుపరి వృద్ధులకు అరటి పండ్లు పెంచినారు తదుపరి లీగల్ ఎయిడ్ క్లినిక్ హెల్ప్ డస్క్ ఓపెన్ చేశారు .ఈ కార్యక్రమంలో లోక్ అదాలత్ సిబ్బంది పేరా లీగల్ వాలంటరీ పెసల వేణుగోపాల్ కే సురేంద్రబాబు మరియు పెంచలమ్మ గ బాపూజీ వృద్ధుల ఆశ్రమం ప్రెసిడెంట్ ఎస్.కె సాధిక్ కి తదితరులు పాల్గొన్నారు.


