తమిళనాడు, పుదుచ్చేరిలో వీధి కుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు సుమోటోగా ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని స్వీకరించింది. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. 2025లో తమిళనాడులో 6.25 లక్షల కుక్క కాట్ల కేసులు, 34 మరణాలు నమోదవ్వగా, 2026 తొలి నాలుగు నెలల్లోనే 2.63 లక్షల కేసులు నమోదైనట్లు కోర్టు దృష్టికి వచ్చింది. ప్రజల ప్రాణ భద్రతకు ముప్పుగా మారుతున్న వీధి కుక్కల సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.

వీధి కుక్కల సమస్యపై సుమోటోగా విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు