వి.యస్.యు లో మహాత్మ గాంధీ 150వ జయంతి వేడుకలు
నెల్లూరు, అక్టోబర్ 2 (పున్నమి విలేకరి) : విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో 150వ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆచార్య . అందె ప్రసాద్ గారు విచ్చేసి గాంధీ చిత్రపటానికి పుష్పగుచ్చాలు సమర్పించారు. రిజిస్ట్రార్ గారు మాటా ్లడుతూ గాంధీగారి ఆశయసాధనలో మనం అందరం పాలు పంచుకోవలని సూచించారు ,అదే విధంగా సత్యం, అహింస మార్గాలను ఈ తరం విద్యా ర్థిని, విద్యార్థులు ఆచరించాలని కోరారు. మన భారత ప్రభుత్వం గాంధీగారి 150 వ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛత -స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమాలు మొదలు పెట్టారు . ఈ కార్య క్రమంలో విద్యార్థులందరూ విరివిగా పాల్గొ నాలని మరియు మన విక్రమ సింహపురి విశ్వవిద్యాలయాన్ని ప్లాస్టిక్ రహిత ప్రాంగణంగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ జయంతి ఉత్స వాలను పురస్కరించుకుని గాంధీ యన్ స్టడీ సెంటర్ వివిధ సాహిత్య పోటీలను నిర్వహించి విజయం సాధించిన విద్యార్థులకు ప్రశంశ పత్రాలను అందజేసింది . ఈ కార్యక్రమంలో అధ్యక్షులుగా ఆచార్య కె . వి. యస్ జవహర్ బాబు గారు, సి డి సి డీన్ ఆచార్య విజయనంద్ బాబు గారు, గాంధీయన్ స్టడీ సెంటర్ సమ న్వయకర్త డా. నీలమణికంఠ గారు, విద్యార్థి, విద్యార్థినులు, భోదన , బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు .