కాకినాడ జిల్లా కాజులూరు మండలం శీలలంక గ్రామంలో బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో వాతావరణ సంబంధిత ప్రమాదాలు మరియు విపత్తులపై గ్రామ సమాఖ్యల సభ్యులకు ప్రాథమిక అవగాహన మరియు విపత్తు నిర్వహణ చట్టం 2005 పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న బీమాబాయి మహిళా మండలి ప్రాజెక్టు డైరెక్టర్ వాసంశెట్టి నందివర్ధన మాట్లాడుతూ విపత్తుల నిర్వహణ చట్టం 2005 పై అవగాహన కలిగి ఉండాలని,దీనివలన విపత్తుల సమయంలో మనకు గల హక్కులను గురించి తెలుసుకోవచ్చు అన్నారు. ఈ సందర్భంగా తుఫానులు, వరదలు,వాతావరణ మార్పులు,వేడి గాలులు తదితర ప్రకృతి వైపరీత్యాలను గురించి నందివర్ధన వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సామాజిక కార్యకర్త డి దేవి మాట్లాడుతూ ప్రకృతి విపత్తుల ముందు,ప్రకృతి విపత్తుల సమయంలో,ప్రకృతి విపత్తుల తరువాత చేపట్టవలసిన చర్యలను గురించి వివరించారు.

విపత్తుల నిర్వహణ చట్టం 2005 పై అవగాహన కలిగి ఉండాలి