ఖమ్మంలో వినాయకుడి మాలధారణ స్వీకరించిన స్కూల్ పిల్లలు, కాలేజ్ విద్యార్థులను మాల తొలగించి వస్తేనే అనుమతిస్తామని హార్వెస్ట్ స్కూల్, కాలేజ్ యాజమాన్యం చెప్పడంపై బీజేపీ నాయకులు, హిందూ సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. హార్వెస్ట్ కాలేజ్ ఎదుట నిర్వహించిన నిరసనలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ, మాలధారణ చేసిన విద్యార్థులను బొట్టు పెట్టి, హారతి ఇచ్చి లోపలికి అనుమతించాల్సిందేనని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గల్లా సత్య నారాయణ హెచ్చరిక తో దిగివచ్చిన యాజమాన్యం మాల దారణ చేసిన విద్యార్థులకు బొట్టు పెట్టి, హారతి ఇచ్చి లోపలికి అనుమతించింది. కార్యక్రమంలో డీకొండ శ్యాం, పిల్లలమర్రి వెంకట్, సాయిరాం, ఆచంటి కోటేశ్వరరావు, వీరభద్రం తదితర హిందూ సంఘాల నేతలు పాల్గొన్నారు.



