ఖమ్మం: నగరంలోని 8వ డివిజన్ వైఎస్సార్ కాలనీ రోడ్ నంబర్ 3లో శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవాల్లో బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు భూక్యా శ్యామ్ సుందర్ నాయక్, పీవీ చంద్రశేఖర్ పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆశీర్వాదం తీసుకుని ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.



