Tuesday, 15 July 2025
  • Home  
  • విద్యుత్ బిల్లుల కాకిలెక్కలు వినియోగదారుల బిల్లులకు రెక్కలు
- Featured - ఆంధ్రప్రదేశ్

విద్యుత్ బిల్లుల కాకిలెక్కలు వినియోగదారుల బిల్లులకు రెక్కలు

విద్యుత్ బిల్లుల కాకిలెక్కలు వినియోగదారుల బిల్లులకు రెక్కల ఏప్రిల్ 2020 నుండి ఏపీ ఈఆర్సీ పెంచిందని చెప్పబడుతున్న విద్యుత్ కాకి లెక్కలు మరోసారి వినియోగదారులపై ఎలా భారం వేసేందుకు కుట్ర జరిగిందో తేటతెల్లమవుతుంది. బిల్లులు సరి చూసుకోండి అన్న లింకు చూస్తే ఇంకా బొక్కలు కని పించాయి. ఉదాహరణకు నా సర్విసుకు సంబంధించిన బిల్లు వివరాలు ఏప్రిల్ 2020 లో 30 రోజులు మే 2020లో 30 రోజులు అని చూపి ఉంది. వాస్తవానికి గత మీటరు రీడింగు మార్చి2020 నెల 6వతేదీన తీసారు. మరలా మేనెల 14న తీసారు.(కోవిడ్ వలన అని ఎంత చెప్పినా రీడింగు ఆలశ్యంగా తీయడం రివాజు.ఒక సారి నాలుగురోజులు ఐదు రోజులు ఆలశ్యం సాధారణంగా జరిగేదే.నష్టం వినియోగదారునికే) అంటే 70 రోజుల వినియోగాన్ని 60 రోజులకు చూపి స్లాబులు తారీఫులు పెంచడం ఒక తప్పు. మార్చినెల 25 రోజులకు పాత తారీఫు వర్తించాలి. కానీ ఏప్రిల్ నెలలో 17 రోజులకు పాత తారీఫు చూపి మిగిలిన దంతా కొత్త తారీఫులో చూపడం మరో మోసం. 70 రోజుల వినియోగాన్ని విభజించి రోజు ఆవిధంగా 30 రోజులకు నిర్ణయించి స్లాబు ఫిక్స్ చేస్తే వినియోగదారునికి ఊరట. కానీ అది జరగలేదు. ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నరోజుల్లో సాఫ్ట్వేర్ మార్చి ప్రపోర్షనేట్ బిల్లింగ్ వేస్తే ఏమన్నా ఇబ్బందా. వినియోగదారులకు పారదర్శకత లేని బిల్లులు వేసి మొండిగా పెంచలేదని చెప్పటం మూర్ఖత్వం కాక మరోకటిలేదు. అసలే కష్టకాలంలో ఉన్న ప్రజలపై ఇటువంటి భారాలు వేయడం ప్రజాహితమా…అందునా మోసపూరితమైన బిల్లును వేసి మొండిగా వాదించడం సహేతుకం కాదు. జూన్ 30 దాకా సమయం ఉంది కట్టొచ్చు అని చెప్పటం మరో భూటకం.బిల్లుల్లో యధాతధంగా డిస్కనెక్షను తేదీని ఇచ్చారు. జూన్ బిల్లు కలిపి ఇంకో మోపు పెనాల్టీ లు వేసి ఇంకా ప్రజాగ్రహానికీ గురౌతారు. ఏదో ప్రతిపక్షాలు చేసే గలభాగా దీన్నిచూపడం అసమంజసం. ప్రతిపక్షాలు పూర్తిగా విశ్లేషించి తమ వాదనలూ వినిపించడంలేధనేది ఇపుడు టీవీ చర్చల్లో స్పష్టంగా తెలుస్తూంది. మరో విద్యుత్ సంస్కరణల పేరుతో కేంద్రం బిల్లును సిధ్ధం చేసింది. అది ఇంకా రాష్ట్రాలపాత్రను తగ్గించి రాజ్యాంగ మూలస్థంభమైన ఫెడరల్ విధానంకి భిన్నంగా ప్రత్యక్ష ధన మార్పిడి పేరుతో మరో భారాలకు సిద్ధమౌతుందీ. జీఎస్టీకి తలూపిన ఈ పార్టీలు ఇపుడు కేంద్రం ముందు భిక్షగాళ్ళుగా మారేట్లు చేసిందానికి ప్రజలు బాధలు భరిస్తున్నారు. రాష్ట్రాల ప్రజల పై భారాలువేసేవాటికి ముద్దుగా సంస్కరణలని పేరెట్టి ఉద్దీపన అనే ఓ కాకి లెక్కల ప్యాకేజి లో కేంద్ర ఆర్ధికమంత్రి గారు.సెలవిచ్చారు. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి విద్యుత్ వినియోగదారుల భారాలను తగ్గించాలి. వినియోగం పెరిగి బిల్లులు పెరిగాయనడం పచ్చి అబద్ధం. యూనిట్లు కొన్నిచోట్ల పెరిగి ఉండొచ్చు. మీ విద్యుత్ బిల్లులలో లోపించిన పారదర్శకత…ఆలశ్యంగా రీడింగు తీస్తే అవసరమైన సాఫ్ట్వేర్ మార్పు…కరోనా కష్టకాలంలో అసలే జీతాలు ఆదాయం మృగ్యమై యున్న వినియౌగదారులపై భారాలు మోసి లేదని మూర్ఖంగా వాదించడం…ఎంత వరకూ సమంజసం. మీకెవరైనా మిస్ లీడ్ చేస్తున్నారేమో ఆలోచించాలనీ రాష్ట్ర నేతకు విజ్ఞప్తి. ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆలోచించకపోతే గత ప్రభుత్వాలకు లభించిన బహుమతి ప్రజలవద్దనుండి లభిస్తూంది. అందుకే పెంచిన బిల్లులు రివైజ్ చేయండి. ఆవరకూ పారదర్శకంగా బిల్లులు పెంచిన.తారీఫు ప్రక్కన పెట్టి ఆఖరి తేదీ లోపు ఎటువంటి పెనాల్టీలు లేకుండా ప్రజలవైపు కష్టాలలో అండగా నిలబడాలనీ అపుడే ప్రజలు హర్షిస్తారనీ..లేకపోతే కరెంటు షాకిచ్చిన ప్రభుత్వాలకు ఎటువంటి సమాధానాలు జనాలు ఇచ్చారో…విద్యుత్ బిల్లులు తగ్గించిన ఢిల్లీ ప్రభుత్వం కు ఏవిధమైన మద్ధతు ఇచ్చారో నేతలు గుర్తెరిగి ప్రవర్తిస్తే మంచిది. ఇట్లు ఓ వినియోగదారుడు జీవి నాగరాజ రావు బీ.యస్సీ ఎల్లెల్బీ

విద్యుత్ బిల్లుల కాకిలెక్కలు
వినియోగదారుల బిల్లులకు రెక్కల

ఏప్రిల్ 2020 నుండి ఏపీ ఈఆర్సీ పెంచిందని చెప్పబడుతున్న విద్యుత్ కాకి లెక్కలు మరోసారి వినియోగదారులపై ఎలా భారం వేసేందుకు కుట్ర జరిగిందో తేటతెల్లమవుతుంది. బిల్లులు సరి చూసుకోండి అన్న లింకు చూస్తే ఇంకా బొక్కలు కని పించాయి.

ఉదాహరణకు నా సర్విసుకు సంబంధించిన బిల్లు వివరాలు
ఏప్రిల్ 2020 లో 30 రోజులు
మే 2020లో 30 రోజులు అని చూపి ఉంది.

వాస్తవానికి గత మీటరు రీడింగు మార్చి2020 నెల 6వతేదీన తీసారు. మరలా మేనెల 14న తీసారు.(కోవిడ్ వలన అని ఎంత చెప్పినా రీడింగు ఆలశ్యంగా తీయడం రివాజు.ఒక సారి నాలుగురోజులు ఐదు రోజులు ఆలశ్యం సాధారణంగా జరిగేదే.నష్టం వినియోగదారునికే) అంటే 70 రోజుల వినియోగాన్ని 60 రోజులకు చూపి స్లాబులు తారీఫులు పెంచడం ఒక తప్పు.
మార్చినెల 25 రోజులకు పాత తారీఫు వర్తించాలి. కానీ ఏప్రిల్ నెలలో 17 రోజులకు పాత తారీఫు చూపి మిగిలిన దంతా కొత్త తారీఫులో చూపడం మరో మోసం. 70 రోజుల వినియోగాన్ని విభజించి రోజు ఆవిధంగా 30 రోజులకు నిర్ణయించి స్లాబు ఫిక్స్ చేస్తే వినియోగదారునికి ఊరట. కానీ అది జరగలేదు. ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నరోజుల్లో సాఫ్ట్వేర్ మార్చి ప్రపోర్షనేట్ బిల్లింగ్ వేస్తే ఏమన్నా ఇబ్బందా. వినియోగదారులకు పారదర్శకత లేని బిల్లులు వేసి మొండిగా పెంచలేదని చెప్పటం మూర్ఖత్వం కాక మరోకటిలేదు. అసలే కష్టకాలంలో ఉన్న ప్రజలపై ఇటువంటి భారాలు వేయడం ప్రజాహితమా…అందునా మోసపూరితమైన బిల్లును వేసి మొండిగా వాదించడం సహేతుకం కాదు.

జూన్ 30 దాకా సమయం ఉంది కట్టొచ్చు అని చెప్పటం మరో భూటకం.బిల్లుల్లో యధాతధంగా డిస్కనెక్షను తేదీని ఇచ్చారు. జూన్ బిల్లు కలిపి ఇంకో మోపు పెనాల్టీ లు వేసి ఇంకా ప్రజాగ్రహానికీ గురౌతారు. ఏదో ప్రతిపక్షాలు చేసే గలభాగా దీన్నిచూపడం అసమంజసం. ప్రతిపక్షాలు పూర్తిగా విశ్లేషించి తమ వాదనలూ వినిపించడంలేధనేది ఇపుడు టీవీ చర్చల్లో స్పష్టంగా తెలుస్తూంది. మరో విద్యుత్ సంస్కరణల పేరుతో కేంద్రం బిల్లును సిధ్ధం చేసింది. అది ఇంకా రాష్ట్రాలపాత్రను తగ్గించి రాజ్యాంగ మూలస్థంభమైన ఫెడరల్ విధానంకి భిన్నంగా ప్రత్యక్ష ధన మార్పిడి పేరుతో మరో భారాలకు సిద్ధమౌతుందీ. జీఎస్టీకి తలూపిన ఈ పార్టీలు ఇపుడు కేంద్రం ముందు భిక్షగాళ్ళుగా మారేట్లు చేసిందానికి ప్రజలు బాధలు భరిస్తున్నారు. రాష్ట్రాల ప్రజల పై భారాలువేసేవాటికి ముద్దుగా సంస్కరణలని పేరెట్టి ఉద్దీపన అనే ఓ కాకి లెక్కల ప్యాకేజి లో కేంద్ర ఆర్ధికమంత్రి గారు.సెలవిచ్చారు.

అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి విద్యుత్ వినియోగదారుల భారాలను తగ్గించాలి. వినియోగం పెరిగి బిల్లులు పెరిగాయనడం పచ్చి అబద్ధం. యూనిట్లు కొన్నిచోట్ల పెరిగి ఉండొచ్చు. మీ విద్యుత్ బిల్లులలో లోపించిన పారదర్శకత…ఆలశ్యంగా రీడింగు తీస్తే అవసరమైన సాఫ్ట్వేర్ మార్పు…కరోనా కష్టకాలంలో అసలే జీతాలు ఆదాయం మృగ్యమై యున్న వినియౌగదారులపై భారాలు మోసి లేదని మూర్ఖంగా వాదించడం…ఎంత వరకూ సమంజసం. మీకెవరైనా మిస్ లీడ్ చేస్తున్నారేమో ఆలోచించాలనీ రాష్ట్ర నేతకు విజ్ఞప్తి. ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆలోచించకపోతే గత ప్రభుత్వాలకు లభించిన బహుమతి ప్రజలవద్దనుండి లభిస్తూంది.

అందుకే పెంచిన బిల్లులు రివైజ్ చేయండి. ఆవరకూ పారదర్శకంగా బిల్లులు పెంచిన.తారీఫు ప్రక్కన పెట్టి ఆఖరి తేదీ లోపు ఎటువంటి పెనాల్టీలు లేకుండా ప్రజలవైపు కష్టాలలో అండగా నిలబడాలనీ అపుడే ప్రజలు హర్షిస్తారనీ..లేకపోతే కరెంటు షాకిచ్చిన ప్రభుత్వాలకు ఎటువంటి సమాధానాలు జనాలు ఇచ్చారో…విద్యుత్ బిల్లులు తగ్గించిన ఢిల్లీ ప్రభుత్వం కు ఏవిధమైన మద్ధతు ఇచ్చారో నేతలు గుర్తెరిగి ప్రవర్తిస్తే మంచిది.

ఇట్లు
ఓ వినియోగదారుడు
జీవి నాగరాజ రావు
బీ.యస్సీ ఎల్లెల్బీ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.