Thursday, 21 May 2026
  • Home  
  • *వాటర్ ప్లాంట్లు నాణ్యత ప్రమాణాలు పాటించాలి : విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ*
- ఆంధ్రప్రదేశ్

*వాటర్ ప్లాంట్లు నాణ్యత ప్రమాణాలు పాటించాలి : విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ*

*ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వాటర్ ప్లాంట్లలో అధికారుల తనిఖీలు* గన్నవరం : పున్నమి ప్రతినిధి సురేష్ గన్నవరం నియోజకవర్గంలోని ప్రజలకు తాగునీటిని అందిస్తున్న పబ్లిక్, ప్రైవేటు వాటర్ ప్లాంట్లలో పూర్తిస్థాయి నాణ్యత ప్రమాణాలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆదేశించారు. వేసవి ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా నాణ్యత లేని, కలుషిత తాగునీరు సేవించడం ద్వారా ప్రజలు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉన్నందున తక్షణం గన్నవరం నియోజకవర్గంలోని ప్రైవేటు, పబ్లిక్ వాటర్ ప్లాంట్లలో తనిఖీలు నిర్వహించి సదరు ప్లాంట్ల ద్వారా సరఫరా అవుతున్న నీటిని ల్యాబ్ లలో పరీక్షలు చేయించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ఫోన్లో మాట్లాడిన యార్లగడ్డ తక్షణం అన్ని వాటర్ ప్లాంట్లను పరిశీలించి నిర్దిష్టమైన నాణ్యత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్లాంట్లలో ఎప్పటికప్పుడు ఫిల్టర్లు మార్చేలా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. నిర్దిష్ట నాణ్యతా ప్రమాణాలు పాటించని, నిబంధనలు ఉల్లంగించిన ప్లాంట్ల యజమానులపై తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. గన్నవరం నియోజకవర్గంలోని ప్రజలందరికీ సురక్షిత తాగునీరు అందించటమే లక్ష్యంగా అధికారులు క్రమం తప్పకుండా వాటర్ ప్లాంట్లను తనిఖీ చేయాలని, తనిఖీల నివేదికను ఉన్నతాధికారులతో పాటు తనకు సమర్పించాలని ఆదేశించారు.

*ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వాటర్ ప్లాంట్లలో అధికారుల తనిఖీలు*

గన్నవరం : పున్నమి ప్రతినిధి సురేష్

గన్నవరం నియోజకవర్గంలోని ప్రజలకు తాగునీటిని అందిస్తున్న పబ్లిక్, ప్రైవేటు వాటర్ ప్లాంట్లలో పూర్తిస్థాయి నాణ్యత ప్రమాణాలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆదేశించారు. వేసవి ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా నాణ్యత లేని, కలుషిత తాగునీరు సేవించడం ద్వారా ప్రజలు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉన్నందున తక్షణం గన్నవరం నియోజకవర్గంలోని ప్రైవేటు, పబ్లిక్ వాటర్ ప్లాంట్లలో తనిఖీలు నిర్వహించి సదరు ప్లాంట్ల ద్వారా సరఫరా అవుతున్న నీటిని ల్యాబ్ లలో పరీక్షలు చేయించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ఫోన్లో మాట్లాడిన యార్లగడ్డ తక్షణం అన్ని వాటర్ ప్లాంట్లను పరిశీలించి నిర్దిష్టమైన నాణ్యత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్లాంట్లలో ఎప్పటికప్పుడు ఫిల్టర్లు మార్చేలా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. నిర్దిష్ట నాణ్యతా ప్రమాణాలు పాటించని, నిబంధనలు ఉల్లంగించిన ప్లాంట్ల యజమానులపై తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. గన్నవరం నియోజకవర్గంలోని ప్రజలందరికీ సురక్షిత తాగునీరు అందించటమే లక్ష్యంగా అధికారులు క్రమం తప్పకుండా వాటర్ ప్లాంట్లను తనిఖీ చేయాలని, తనిఖీల నివేదికను ఉన్నతాధికారులతో పాటు తనకు సమర్పించాలని ఆదేశించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.