Thursday, 15 January 2026
  • Home  
  • ల కూచిపూడి నృత్య గురువు, నర్తకీమణి శ్రీమతి కొత్తపల్లి పద్మ గారు కనుమూశారు
- Featured - తెలంగాణ

ల కూచిపూడి నృత్య గురువు, నర్తకీమణి శ్రీమతి కొత్తపల్లి పద్మ గారు కనుమూశారు

సీనియర్ కూచిపూడి నృత్య గురువు, నర్తకీమణి శ్రీమతి కొత్తపల్లి పద్మ గారు హైదరాబాద్ లో కనుమూశారు కొంతకాలంగా ఆమె పక్షవాతానికి గురై అనారోగ్యం తో చికిత్స పొందుతున్నారు! డాక్టర్ వెంపటి చినసత్యం గారి దగ్గర 18 ఏళ్ల పాటు శిష్యరికం చేశారు! తెనాలికి చెందిన పద్మ గారు హైదరాబాద్ లో స్థిరపడి శ్రీనృత్యాలయ నాట్య సంస్థను ప్రారంభించి ఎందరో శిష్య ప్రశిష్యులను తీర్చి దిద్దారు ! తన ఐదవ ఏటనే నృత్యం పై మక్కువ పెంచుకున్నారు! టెన్త్ పూర్తీ కాగానే, విజయవాడ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో నాట్యం లో డిప్లొమా పూర్తీ చేశారు! 1962 లో మద్రాస్ వెళ్లి పద్మభూషణ్ వెంపటి చిన సత్యం గారు నిర్వహించే కూచిపూడి ఆర్ట్ అకాడమీ లో శిష్యురాలిగా చేరారు! మద్రాస్ లో జరిగిన ఆమె కూచిపూడి నాట్య అరంగేట్రానికి నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి విచ్చేసిన విషయాన్నీ ఆమె ఎప్పుడూ గుర్తు చేస్తుండే వారు! శృంగారమణి, నాట్య మయూరి లాంటి బిరుదులూ పొందారు! ఆ రోజుల్లోనే కేంద్రం నుంచి స్కాలర్షిప్, ప్రశంసలు అందుకున్న గొప్ప నర్తకి గా గుర్తింపు పొందారు. ఐదు రోజుల క్రితమే ఆమె కుమారుడు కిరణ్ గుండెపోటు తో చనిపోయారు! ఆ దిగులు, అనారోగ్యపు ఇబ్బందులు పద్మ గారిని మరింత కుంగదీసాయి! కూచిపూడి ఆణిముత్యం పద్మ గారు లేని లోటు తీరనిది! వారికి నివాళి?

సీనియర్ కూచిపూడి నృత్య గురువు, నర్తకీమణి శ్రీమతి కొత్తపల్లి పద్మ గారు హైదరాబాద్ లో కనుమూశారు

  1. కొంతకాలంగా ఆమె పక్షవాతానికి గురై అనారోగ్యం తో చికిత్స పొందుతున్నారు! డాక్టర్ వెంపటి చినసత్యం గారి దగ్గర 18 ఏళ్ల పాటు శిష్యరికం చేశారు! తెనాలికి చెందిన పద్మ గారు హైదరాబాద్ లో స్థిరపడి శ్రీనృత్యాలయ నాట్య సంస్థను ప్రారంభించి ఎందరో శిష్య ప్రశిష్యులను తీర్చి దిద్దారు ! తన ఐదవ ఏటనే నృత్యం పై మక్కువ పెంచుకున్నారు! టెన్త్ పూర్తీ కాగానే, విజయవాడ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో నాట్యం లో డిప్లొమా పూర్తీ చేశారు! 1962 లో మద్రాస్ వెళ్లి పద్మభూషణ్ వెంపటి చిన సత్యం గారు నిర్వహించే కూచిపూడి ఆర్ట్ అకాడమీ లో శిష్యురాలిగా చేరారు! మద్రాస్ లో జరిగిన ఆమె కూచిపూడి నాట్య అరంగేట్రానికి నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి విచ్చేసిన విషయాన్నీ ఆమె ఎప్పుడూ గుర్తు చేస్తుండే వారు! శృంగారమణి, నాట్య మయూరి లాంటి బిరుదులూ పొందారు! ఆ రోజుల్లోనే కేంద్రం నుంచి స్కాలర్షిప్, ప్రశంసలు అందుకున్న గొప్ప నర్తకి గా గుర్తింపు పొందారు. ఐదు రోజుల క్రితమే ఆమె కుమారుడు కిరణ్ గుండెపోటు తో చనిపోయారు! ఆ దిగులు, అనారోగ్యపు ఇబ్బందులు పద్మ గారిని మరింత కుంగదీసాయి! కూచిపూడి ఆణిముత్యం పద్మ గారు లేని లోటు తీరనిది! వారికి నివాళి?

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.