రోడ్డు ప్రమాదం జరిగినట్లు నాటకం ఆడి, సహాయం చేసేందుకు వచ్చిన వ్యక్తి వద్ద నుంచి ఖరీదైన సెల్‌ఫోన్ అపహరించిన ఘటన సోమవారం ఖమ్మం కొత్త బస్టాండ్ సమీపంలో చోటుచేసుకుంది. బాధితుడు సాంబశివరావు కథనం ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు బైక్‌పై నుంచి కిందపడినట్లు నటించడంతో, వారికి సహాయం చేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో అతడి జేబులో ఉన్న సుమారు రూ.1.30 లక్షల విలువైన సెల్‌ఫోన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించి అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనపై బాధితుడు ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.



