శ్రీ కాళహస్తి, జులై 17, (పున్నమి న్యూస్): ఆపదలో ఉన్న పార్టీ కార్యకర్తలకు తానున్నానంటూ జనసేన నాయకులు దండి నరేంద్ర మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. చోడవరం నుండి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురై, ప్రస్తుతం తిరుపతిలోని హీలియోస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జనసేన నాయకుడు ధనా సోదరుడు చిట్టిబాబును ఆయన శుక్రవారం పరామర్శించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన దండి నరేంద్ర, గురువారమే ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి చిట్టిబాబుకు సజావుగా వైద్య సేవలు అందేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం ఆసుపత్రికి వెళ్లి బాధితుడిని ఓదార్చిన ఆయన, చికిత్స అందిస్తున్న వైద్యులు డా. శ్రీనివాస్ రెడ్డి, డా. కెన్నెట్, డా. మల్లికార్జున్, డా. హరీష్లతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ప్రాణాపాయం తప్పిందని, చికిత్సకు శరీరం సానుకూలంగా స్పందిస్తుండటంతో మరో రెండు రోజుల్లో జనరల్ వార్డుకు తరలిస్తామని వైద్యులు ధీమా వ్యక్తం చేశారు. చిట్టిబాబు సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఈ పరామర్శ కార్యక్రమంలో జనసేన నాయకులు లక్ష్మణ్, నవీన్, ధనా, మస్తాన్, దివాకర్, వెంకటయ్యలతో పాటు వాగివేడు గ్రామ జనసైనికులు, కుటుంబ సభ్యులు పాల్గొని ధైర్యం చెప్పారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన జనసైనికుడికి దండి నరేంద్ర భరోసా-త్వరలోనే కోలుకుంటారని వెల్లడి