రైతుల గురించి మాట్లాడితే డ్యూటీ నుంచి తొలగింపా..?
పున్నమి న్యూస్
26 మే 2026
తెలంగాణ ఇంచార్జి
జగిత్యాలలో ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌పై చర్యలు
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ నాయకులు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో, “ముందు వడ్ల సమస్య గురించి మాట్లాడండి” అని తమ గ్రామ వ్యక్తితో చెప్పినందుకు ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌పై అధికారులు చర్యలు తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
“నేను ఏ రాజకీయ పార్టీని గానీ, ఏ నాయకుడిని గానీ విమర్శించలేదు… రైతుల సమస్య గురించి మాత్రమే మాట్లాడాను” అని అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటన అనంతరం జీఎం తనను డ్యూటీకి రావొద్దని చెప్పారని, ఆర్ఎం కార్యాలయం నుంచి రిమూవల్ లెటర్ వచ్చిందని, ఐదు డిపోలలో కూడా తనకు డ్యూటీ వేయొద్దని అధికారులకు సమాచారం పంపినట్లు తెలిపారు.
ఈ వ్యవహారం ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. రైతుల సమస్యలపై మాట్లాడినందుకే చర్యలు తీసుకోవడం సరైందా..? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
“రైతుల మాట మాట్లాడితే శిక్షనా..?”
ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌కు మద్దతుగా పలువురు నిలుస్తున్నారు…



