రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “బడి పిలుస్తోంది” ఎన్రోల్మెంట్ డ్రైవ్ కార్యక్రమం SPSR నెల్లూరు జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలు మరియు అర్హత కలిగిన ఉపాధ్యాయుల బోధనను గుర్తించిన తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ముందుకు రావడం ఆనందదాయకమని స్టేట్ అబ్జర్వెర్ మరియు జిల్లా ఇంచార్జీ శ్రీమతి శారద కుమారి గారు మరియు
జిల్లా సమగ్ర శిక్ష కమ్యూనిటీ మొబిలైజింగ్ అధికారి గోగుల రమణయ్య గారు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతంలో తల్లిదండ్రుల సహకారం ఎంతో కీలకమని వారు తెలిపారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు అన్ని పాఠశాలలకు తొందర్లో చేరుతాయి మరియు ప్రతి విద్యార్థికి అన్ని కిట్లు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని స్టేట్ అబ్జర్వర్ తెలియజేశారు
ఎన్రోల్మెంట్ డ్రైవ్‌లో భాగంగా ఈరోజు ఇందుకూరుపేట మండలం డెవిస్ పేట గ్రామంలో పర్యటించి తల్లిదండ్రులతో సమావేశమై ప్రభుత్వ పాఠశాలల్లో లభిస్తున్న విద్యా అవకాశాలు, మౌలిక వసతులు, విద్యార్థులకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంతరం ప్రైవేట్ పాఠశాలలకు వెళుతున్న కొంతమంది విద్యార్థులను స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా గ్రామంలో తల్లిదండ్రులు, పాఠశాల మేనేజింగ్ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించి ప్రజలను చైతన్య పరచారు. కార్యక్రమంలో ఇందుకూరుపేట మండల విద్యాశాఖ అధికారి M,V, సునీల్ కుమార్ గారు మరియు కొత్తూరు హై స్కూల్ హెడ్మాస్టర్ మల్లిఖార్జున పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ పాల్గొన్నారు.
అనంతరం ఇందుకూరుపేట మండలం సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర-2 స్టాక్ పాయింట్లను సందర్శించి, విద్యార్థి కిట్ల పంపిణీలో తీసుకోవలసిన జాగ్రత్తలు, స్కూల్ వారీగా ప్యాకింగ్ నిర్వహణపై సంబంధిత సిబ్బందికి సూచనలు చేశారు. మండలం లోని CRMTS తో సమావేశం నిర్వహించి మండలము లోని విద్యా విషయక విషయాలు, నూతన అడ్మిషన్స్ గురించి చర్చించడం జరిగింది..

