“పంట పొలాలను కాపాడుకుందాం రండి” కార్యక్రమం
పున్నమి ప్రతినిధి , రామచంద్రాపురం
రైతులు తమ పొలాలలో రసాయనక ఎరువులు పురుగు మందులు విచక్షణ రహితంగా వినియోగించడం వల్ల సారవంతంగా ఉన్న భూములు అన్ని కూడా నిస్సారమైపోతున్నాయని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రిన్సిపల్ డాక్టర్ ఏ రామకృష్ణారావు అన్నారు. శుక్రవారం మండలంలోని రాయల చెరువు గ్రామంలో రైతు సాధికారక సంస్థ సంస్థ, జిల్లా ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో పంట పొలాలను కాపాడుకుందాం రండి అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు రసాయనక ఎరువులకు ప్రత్యామ్నాయంగా “జీవన ఎరువులు, (అజోస్ ఫైరిల్లమ్, అజటో బాక్టర్., రైజోబియం, పి.ఎస్.బి., కె ఎస్. బి., మరియు పచ్చి రొట్టె పంటలు( జనుము, జీలుగ, పిల్లి పెసర,అలసంద వంటి పంటలను పండించాలని రైతులకు సూచించారు. రైతులు వేసవికాలంలో మట్టి నమూనాలను సేకరించి భూసార పరీక్ష కేంద్రానికి పంపి వాటి ఫలితాలకు అనుగుణంగా ఎరువులు వేసుకోవాలని రైతులకు సూచించారు. పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా “జీవ సంబంధమైన పురుగు మందులను” పిచికారి చేసుకోవాలని రైతులకు సూచించారు .*పంటలలో ఆశించే పురుగులు నివారణ చేసుకోవడానికి ఎటువంటి పురుగు మందులు పిచికారీ చేయకుండ రైతులు తమ పొలాల్లో ఎకరానికి 25 పసుపు రంగు జిగురు అట్టలు, 25 నీలి రంగు జిగురు అట్టలు,10 లింగాకర్షణ బుట్టలు పెట్టుకొని సమర్ధవంతంగా పురుగులను నివారించుకోవచ్చని రైతులకు తెలియజేశారు. రైతులు “వ్యవసాయ యాంత్రీకరణ” వైపు మొగ్గు చూపాలని రైతు లను కోరారు. రైతు సాధికారిక సంస్థ డిపిఎం పట్టాభిరెడ్డి మాట్లాడుతూ రైతులు ఉద్యానవన పంటలు, పండ్ల తోటలు మరియు సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని రైతులను కోరారు. *రైతులు బిందు సేద్యం మరియు తుంపర్ల సేద్యం అవగాహన పెంచుకొని ఉద్యాన వన పంటలను సాగు చేయాలని రైతులకు కోరారు. రైతులకు ఖరీఫ్ 2026 లో పి. ఎం. డి. ఎస్. విత్తన కిట్లు, ఒక కిట్టు 10 కేజీలు ధర 650/- చొప్పున రైతులకు పంపిణీ చేస్తున్నామని రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, రైతు సాధికారిక సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్
1. పంట పొలాలను కాపాడుకుందాం రండి కార్యక్రమంలో రైతులకు అవగాహన కల్పిస్తున్న దృశ్యం.

