వ్యవసాయ రంగంలో సాంకేతికత వినియోగాన్ని పెంచేందుకు రైతులకు వాతావరణ ఆధారిత సమాచార సేవలను విస్తరిస్తున్నారు. మొబైల్ యాప్లు, ఎస్ఎంఎస్ సేవల ద్వారా వర్షపాతం, ఉష్ణోగ్రతలు, పంటల సూచనలు అందిస్తున్నారు.
ఈ సేవలతో రైతులు సరైన సమయంలో వ్యవసాయ పనులు చేపట్టి నష్టాలను తగ్గించుకోవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.


