Wednesday, 16 September 2026
  • Home  
  • రేపు నెల్లూరు జిల్లాలో నారా లోకేశ్ పర్యటన
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రేపు నెల్లూరు జిల్లాలో నారా లోకేశ్ పర్యటన

నెల్లూరు సెప్టెంబర్ 15 పున్నమి ప్రతినిధి విద్యాశాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బుధవారం నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఓ ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా నెల్లూరు నగరంలోని ఆర్ఎస్ఆర్, డీఎస్ఆర్ పాఠశాలల్లో పునరుద్ధరించిన భవనాలను మంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం కోవూరు మండలం చిన్నపడుగుపాడులో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. తర్వాత కోవూరులో టీడీపీ పార్టీ శ్రేణులతో సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారు. మంత్రి పర్యటనకు సంబంధించి అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉంది.

నెల్లూరు సెప్టెంబర్ 15 పున్నమి ప్రతినిధి

విద్యాశాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బుధవారం నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఓ ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా నెల్లూరు నగరంలోని ఆర్ఎస్ఆర్, డీఎస్ఆర్ పాఠశాలల్లో పునరుద్ధరించిన భవనాలను మంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం కోవూరు మండలం చిన్నపడుగుపాడులో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. తర్వాత కోవూరులో టీడీపీ పార్టీ శ్రేణులతో సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారు. మంత్రి పర్యటనకు సంబంధించి అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.