తాండూర్ ఆగస్టు 07 :
మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం
కొత్తపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రేపల్లెవాడ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామసర్పంచ్ ఆకుల వెంకటేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని చిన్నారులకు తొలిసారిగా అన్నం తినిపిస్తూ వారి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా అంగన్వాడీ సిబ్బంది చిన్నారుల తల్లిదండ్రులకు పౌష్టికాహారం, పరిశుభ్రత, చిన్నారుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించారు. చిన్నారులకు సమతుల్య ఆహారం అందించడం ద్వారా వారి శారీరక, మానసిక వికాసానికి తోడ్పడవచ్చని తెలిపారు. ఈ అన్నప్రాసన కార్యక్రమంలో వార్డు మెంబర్లు ఆశా వర్కర్లు, టీచర్లు,చిన్నారుల తల్లిదండ్రులు, అంగన్వాడీ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



