రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే లక్ష్యంతో సంగం గ్రామంలో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.
రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో సంగం గ్రామంలోని కరెంట్ ఆఫీస్ సెంటర్ పరిధిలో ఇంటింటికీ వెళ్లిన టీడీపీ నాయకులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. అలాగే ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటూ ప్రభుత్వ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ సంగం మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసులు రెడ్డి, మండల కార్యదర్శి గంగిశెట్టి సత్యనారాయణ, సంగం మాజీ సర్పంచ్ కండెపోయిన వెంకట శేషయ్య, పార్టీ నాయకులు కొరుమెర్ల శ్రీనివాస్ చౌదరి, కాకు మధుసూదన్ యాదవ్, పృథ్వి యాదవ్, జయ కుమార్ రెడ్డి, పవన్ కుమార్, వెంగయ్య, వెంకటేశ్వర్లు, వేణుగోపాల్, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.



