స్కూల్ నుంచి వచ్చాక కనిపించని తురక అనిల్ కుమార్. మెరూన్ షర్ట్, నల్ల ప్యాంటులో ఉన్న బాలుడి ఆచూకీ తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వినతి
*రెంటచింతల, జూలై 04(పున్నమి ప్రతినిథి) : స్థానిక వివేక స్కూల్‌లో 3వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలుడు తురక అనిల్ కుమార్ శుక్రవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయాడు. ఈ మేరకు బాలుడి తల్లి శ్రీమతి తురక నాగమణి రెంటచింతల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.శుక్రవారం ఉదయం సుమారు 8:30 గంటలకు బాలుడు అనిల్ కుమార్ యథావిధిగా పాఠశాలకు వెళ్లాడు. సాయంత్రం 4:00 గంటల సమయంలో ఇంటి పరిసరాలకు తిరిగి వచ్చిన అతను, ఆ తర్వాత నుంచి కనిపించకుండా పోయాడని తల్లి నాగమణి పోలీసులకు తెలిపారు. బంధువులు, చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.అదృశ్యమైన సమయంలో బాలుడు మెరూన్ రంగు చొక్కా, నల్ల రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. పొట్టిగా, సన్నగా ఉంటాడు.బాలుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సమాచారం తెలిసిన వెంటనే రెంటచింతల పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ఎస్సై నాగార్జున కోరారు.


