కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి బుచ్చిరెడ్డిపాలెం మండలంలో సంచలన ప్రకటన చేశారు. రహదారుల దుస్థితికి శాశ్వత పరిష్కారం చూపుతూ రూ.16 కోట్ల అంచనా వ్యయంతో త్వరలోనే నిర్మాణ పనులకు టెండర్లు పిలవనున్నట్లు స్పష్టం చేశారు. మంత్రి పొంగూరు నారాయణ ప్రకటించిన రూ.45 కోట్ల నిధులతోనే ఈ రోడ్ల పనులు చేపడుతున్నామని, ప్రజలంతా పరిసరాల పరిశుభ్రతను భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.



