ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న పేషంట్ కేర్, శానిటేషన్, సెక్యూరిటీ గార్డుల సమస్యల పరిష్కారానికి సీపీఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. రిమ్స్ ఆసుపత్రి సందర్శనకు వచ్చిన జిల్లా కలెక్టర్‌ను సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి, జిల్లా నాయకుడు కుంటాల రాములు నేతృత్వంలో కార్మికులు కలిసి తమ సమస్యలను వివరించారు. పెండింగ్ ఏరియర్స్ వెంటనే చెల్లించాలని, కనీస వేతనం రూ.26 వేలుగా అమలు చేయాలని, సీనియారిటీ ఆధారంగా ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. అలాగే పీఎఫ్, ఈఎస్ఐ బకాయిలు జమ చేసి కార్డులు అందించాలని విజ్ఞప్తి చేశారు. మహిళా కార్మికులకు యూనిఫామ్‌లు, బూట్లు, సంవత్సరానికి 20 రోజుల చెల్లింపు సెలవులు కల్పించాలని కోరారు. గత కాంట్రాక్టర్లు వేతనాల విషయంలో కార్మికులను మోసం చేశారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కార్మికుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని వినతిపత్రంలో కోరారు.

రిమ్స్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌కు వినతిపత్రం