Monday, 18 May 2026
  • Home  
  • రాష్ట్ర హోంమంత్రిచే శ్రీకాళహస్తి టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రారంభం
- తిరుపతి

రాష్ట్ర హోంమంత్రిచే శ్రీకాళహస్తి టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రారంభం

శ్రీ కాళహస్తి, మే 18, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలో రూ.2.75 కోట్ల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక టూ టౌన్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ..ప్రజలకు పోలీస్ సేవలను మరింత సులభతరం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేసి, కేసుల పురోగతిని డిజిటల్ డ్యాష్‌బోర్డ్ ద్వారా పర్యవేక్షించే విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. శ్రీకాళహస్తికి వచ్చే భక్తుల భద్రత, మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆనంతరం మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ..రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు ఆధునికీకరణ దిశగా అభివృద్ధి చెందుతున్నాయని, డిజిటల్ డెస్క్ విధానంతో కేసుల పరిష్కారం వేగవంతమవుతుందని చెప్పారు. పట్టణంలోని సీసీటీవీ నిఘా వ్యవస్థ భద్రతను మరింత బలోపేతం చేస్తోందన్నారు. చివరగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో నిలిచిపోయిన భవన నిర్మాణ పనులను ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. దాదాపు 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మహిళల కౌన్సెలింగ్ గదులు సహా అన్ని విభాగాలతో ఆధునిక వసతులు కల్పించినట్లు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.