శ్రీ కాళహస్తి, జూన్ 16, (పున్నమి న్యూస్) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ నిర్వహించిన సమగ్ర మూల్యాంకనంలో శ్రీకాళహస్తి దేవస్థానం రాష్ట్రవ్యాప్తంగా ప్రథమ స్థానాన్ని (1వ ర్యాంకు) కైవసం చేసుకుంది. పరిపాలనలో పారదర్శకత, భక్తులకు మెరుగైన సేవలందించడం, ఆలయ పరిసరాల పరిశుభ్రత, మెరుగైన సౌకర్యాల కల్పన, వివిధ అభివృద్ధి కార్యక్రమాల అమలు వంటి పలు కీలక అంశాలలో అద్భుతమైన పనితీరు కనబరిచినందుకు గాను ఈ అరుదైన ఘనత దక్కింది. దేవస్థానానికి ఈ అత్యున్నత స్థానం లభించడంపై శ్రీకాళహస్తి దేవస్థాన చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. ఆలయ ప్రతిష్టను రాష్ట్రస్థాయిలో నిలబెట్టినందుకు, ఈ ఘనత సాధించడంలో అహర్నిశలు సహకరించిన భక్తులకు, దేవస్థాన కార్యనిర్వాహక అధికారులకు, సిబ్బందికి, సేవాదారులకు మరియు పాలకమండలి సభ్యులందరికీ ఆయన ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులోనూ భక్తులకు మరిన్ని మెరుగైన సేవలు అందిస్తూ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రస్థాయిలో శ్రీకాళహస్తి దేవస్థానానికి ప్రథమ స్థానం-చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ హర్షం