టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మరియు సంక్షేమ ప్రయాణం ఒక్క పరిశీలన:
*ఉత్తరాంధ్ర: గ్లోబల్ టెక్ & గ్రీన్ హబ్*
* *గూగుల్ AI హబ్:* విశాఖలో అదానీ-ఎయిర్‌టెల్ భాగస్వామ్యంతో రూ. 1.25 లక్షల కోట్లతో గిగావాట్-స్థాయి గూగుల్ మెగా AI హబ్ & డేటా సెంటర్‌కు శంకుస్థాపన.
* *పారిశ్రామిక విప్లవం:* కాకినాడలో గ్రీన్ హైడ్రోజన్/అమ్మోనియా ప్లాంట్, అనకాపల్లిలో అర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, రీన్యూ సోలార్ ప్లాంట్‌ల ఏర్పాటు.
* *భోగాపురం ఎయిర్‌పోర్ట్:* ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చేసిన అంతర్జాతీయ విమానాశ్రయం.
*కోస్తాంధ్ర: అమరావతి పునర్జన్మ & మెగా ప్రాజెక్టులు*
* *అమరావతి నిర్మాణం:* విధ్వంసం నుండి బయటపడి పరుగులు పెడుతున్న ప్రపంచస్థాయి రాజధాని పనులు.
* *రిలయన్స్ గ్యాసిఫికేషన్:* ఏలూరు జిల్లాలో రూ. 1 లక్ష కోట్లతో దేశంలోనే తొలిసారిగా అండర్‌గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్.
* *ఇసుక విధానం:* ఉచిత ఇసుక విధానంతో భవన నిర్మాణ కార్మికులకు ఉపశమనం.
*రాయలసీమ: ఫ్యాక్షన్ నుండి ఫ్యాక్టరీలు*
* *కడప ఉక్కు కర్మాగారం:* జేఎస్‌డబ్ల్యూ (JSW) ఆధ్వర్యంలో రూ. 8,800 కోట్లతో ఉక్కు కర్మాగార పనులకు శ్రీకారం.
* *రక్షణ రంగం:* పుట్టపర్తిలో రూ. 2,000 కోట్లతో ఏఎంసీఏ (AMCA) ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్.
* *పరిశ్రమలు:* సత్యవేడులో రాయల్ ఎన్ఫీల్డ్ ప్లాంట్, శ్రీసత్యసాయి జిల్లాలో రూ. 51,300 కోట్లతో సోలార్ & బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టులు.
* *సంక్షేమం + అభివృద్ధి:* ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్లు, దీపం-2 ఉచిత సిలిండర్లతో పాటు రూ. 23 లక్షల కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ప్రయాణం.
* *ట్రిపుల్ ఇంజిన్ సర్కార్:* ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ‘స్వర్ణంధ్ర’ దిశగా అడుగులు.

