Thursday, 9 July 2026
  • Home  
  • రామవరంలో డిజిటల్ శిక్షణ సర్టిఫికెట్లపై అవగాహన, ఎస్‌ఐఆర్ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే నల్లమిల్లి
- తూర్పు గోదావరి

రామవరంలో డిజిటల్ శిక్షణ సర్టిఫికెట్లపై అవగాహన, ఎస్‌ఐఆర్ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే నల్లమిల్లి

✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు పున్నమి న్యూస్ రిపోర్టర్, తూర్పు గోదావరి జిల్లా  అనపర్తి, జూలై 7: అనపర్తి మండలం రామవరంలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ డిజిటల్ శిక్షణ సర్టిఫికెట్ల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనంతరం అనపర్తి, బిక్కవోలు మండలాల భారతీయ జనతా పార్టీ BLA-2లతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిజిటల్ శిక్షణ సర్టిఫికెట్ల ఉపయోగాలు, వాటి ద్వారా యువతకు కలిగే అవకాశాలపై ఎమ్మెల్యే వివరించారు. అలాగే ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి, ప్రతి అర్హుడైన ఓటరు వివరాలు నమోదు అయ్యేలా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి, బిక్కవోలు మండలాల బీజేపీ నాయకులు, BLA-2లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు

పున్నమి న్యూస్ రిపోర్టర్, తూర్పు గోదావరి జిల్లా 

అనపర్తి, జూలై 7: అనపర్తి మండలం రామవరంలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ డిజిటల్ శిక్షణ సర్టిఫికెట్ల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనంతరం అనపర్తి, బిక్కవోలు మండలాల భారతీయ జనతా పార్టీ BLA-2లతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డిజిటల్ శిక్షణ సర్టిఫికెట్ల ఉపయోగాలు, వాటి ద్వారా యువతకు కలిగే అవకాశాలపై ఎమ్మెల్యే వివరించారు. అలాగే ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి, ప్రతి అర్హుడైన ఓటరు వివరాలు నమోదు అయ్యేలా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అనపర్తి, బిక్కవోలు మండలాల బీజేపీ నాయకులు, BLA-2లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.