Saturday, 23 May 2026
  • Home  
  • రాచర్ల గొల్లపల్లిలో సీతారాముల కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్
- రాజన్న సిరిసిల్ల

రాచర్ల గొల్లపల్లిలో సీతారాముల కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లా /మార్చి /పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని హనుమాన్ ఆలయంలో నిర్వహించిన శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకల్లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు, పార్టీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నప్రసాద వితరణ నిర్వహించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా /మార్చి /పున్నమి ప్రతినిధి

రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని హనుమాన్ ఆలయంలో నిర్వహించిన శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకల్లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గ్రామ ప్రజలు, పార్టీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నప్రసాద వితరణ నిర్వహించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.