రాజన్న సిరిసిల్ల జిల్లా పున్నమి ప్రతినిధి
07/07/2026
ముస్తాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రైతుల సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, బీసీ సంఘం స్టేట్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ మెంగని మనోహర్ అన్నారు.
ఒక యూరియా బస్తా కోసం రైతులు పడిగాపులు కాస్తున్న పరిస్థితి నెలకొందని, రైతుల ఉసురు తీసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని విమర్శించారు. రైతుల హక్కుల కోసం పోరాడుతున్న తమపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడబోమని, అవసరమైతే జైలుకు వెళ్లేందుకూ సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రైతుబంధు, రైతు బీమా, యూరియా, దుక్కిమందు సరఫరా, వడ్ల కొనుగోలు, రైతులకు చెల్లింపులు సకాలంలో జరిగేవని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర రైతాంగానికి అవసరమైన మేర యూరియా, దుక్కిమందు అందే వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కొమ్మెట రాజు, శీలం వెంకటేష్, జహంగీర్, తుమ్మలపల్లి శేఖర్, వల్లెపు దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.

యూరియా కొరతపై రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తాం: మెంగని మనోహర్
రాజన్న సిరిసిల్ల జిల్లా పున్నమి ప్రతినిధి 07/07/2026 ముస్తాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రైతుల సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, బీసీ సంఘం స్టేట్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ మెంగని మనోహర్ అన్నారు. ఒక యూరియా బస్తా కోసం రైతులు పడిగాపులు కాస్తున్న పరిస్థితి నెలకొందని, రైతుల ఉసురు తీసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని విమర్శించారు. రైతుల హక్కుల కోసం పోరాడుతున్న తమపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడబోమని, అవసరమైతే జైలుకు వెళ్లేందుకూ సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రైతుబంధు, రైతు బీమా, యూరియా, దుక్కిమందు సరఫరా, వడ్ల కొనుగోలు, రైతులకు చెల్లింపులు సకాలంలో జరిగేవని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర రైతాంగానికి అవసరమైన మేర యూరియా, దుక్కిమందు అందే వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కొమ్మెట రాజు, శీలం వెంకటేష్, జహంగీర్, తుమ్మలపల్లి శేఖర్, వల్లెపు దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.

