Thursday, 1 October 2026
  • Home  
  • మేడిపల్లి విద్యార్థులకు PRG ఫౌండేషన్ ప్రోత్సాహం
- రంగారెడ్డి

మేడిపల్లి విద్యార్థులకు PRG ఫౌండేషన్ ప్రోత్సాహం

మేడిపల్లి విద్యార్థులకు PRG ఫౌండేషన్ ప్రోత్సాహం SSCలో మండల స్థాయిలో రెండో స్థానం సాధించిన గోదాసు సుష్మకు ఘన సన్మానం యాచారం: మేడిపల్లి ZPHS ప్రభుత్వ పాఠశాలలో SSC పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను PRG ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. యాచారం మండలంలో SSC ఫలితాల్లో రెండో స్థానం సాధించిన గోదాసు సుష్మతో పాటు, మేడిపల్లి పాఠశాలలో 550కు పైగా మార్కులు సాధించిన ఎనిమిది మంది విద్యార్థులకు PRG ఫౌండేషన్ అధ్యక్షులు ప్రొద్దుటూరి రవీందర్ గుప్త నగదు బహుమతులు, మెమెంటోలు అందజేసి సత్కరించారు. విద్యార్థులను అభినందిస్తూ వారి ఉన్నత భవిష్యత్తుకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉదయశ్రీ, సర్పంచ్ ముచ్చర్ల సుగుణ , ఉపసర్పంచ్ మధుకర్ రెడ్డి, PACS డైరెక్టర్ మక్కపల్లి స్వరూప, ఆలంపల్లి నరసింహ తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.

మేడిపల్లి విద్యార్థులకు PRG ఫౌండేషన్ ప్రోత్సాహం

SSCలో మండల స్థాయిలో రెండో స్థానం సాధించిన గోదాసు సుష్మకు ఘన సన్మానం

యాచారం: మేడిపల్లి ZPHS ప్రభుత్వ పాఠశాలలో SSC పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను PRG ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. యాచారం మండలంలో SSC ఫలితాల్లో రెండో స్థానం సాధించిన గోదాసు సుష్మతో పాటు, మేడిపల్లి పాఠశాలలో 550కు పైగా మార్కులు సాధించిన ఎనిమిది మంది విద్యార్థులకు PRG ఫౌండేషన్ అధ్యక్షులు ప్రొద్దుటూరి రవీందర్ గుప్త నగదు బహుమతులు, మెమెంటోలు అందజేసి సత్కరించారు. విద్యార్థులను అభినందిస్తూ వారి ఉన్నత భవిష్యత్తుకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉదయశ్రీ, సర్పంచ్ ముచ్చర్ల సుగుణ , ఉపసర్పంచ్ మధుకర్ రెడ్డి, PACS డైరెక్టర్ మక్కపల్లి స్వరూప, ఆలంపల్లి నరసింహ తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.