విశాఖ దక్షిణ నియోజకవర్గం, బురుజుపేటలోని SKML ఆలయం బ్యాక్ గేట్ వద్ద బురుజుపేట ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ దుర్గాదేవి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రాట మహోత్సవం ఘనంగా జరిగింది.
ఈ మహోత్సవంలో దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు, జనసేన విశాఖ నగర అధ్యక్షులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇలాంటి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజల్లో ఐక్యతను, భక్తిభావాన్ని పెంపొందిస్తాయని, భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహిస్తున్న బురుజుపేట ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు శ్రీకాంత్, వరుణ్ సాయి, రాఘవ, మణికంఠ, సంతోష్, పటాభి తదితరులు పాల్గొన్నారు.


