కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మేఘాలయలో ఈశాన్య భారతదేశంలో అతిపెద్ద సేంద్రీయ మసాలా ప్రాసెసింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు. రి-భోయి జిల్లాలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం సంవత్సరానికి 10,000 మెట్రిక్ టన్నుల మసాలాలను ప్రాసెస్ చేయగలదు. పసుపు, మిరియాలు సహా అనేక రకాల సేంద్రీయ మసాలాలను ఇక్కడ శుద్ధి చేసి మార్కెట్‌కు పంపనున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల 5,500 మందికి పైగా రైతులకు ప్రత్యక్షంగా ప్రయోజనం కలగనుంది. రైతుల ఆదాయం పెరగడంతో పాటు ఈశాన్య రాష్ట్రాల వ్యవసాయ రంగానికి కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి.

మేఘాలయలో ఈశాన్య భారతదేశంలో అతిపెద్ద సేంద్రీయ మసాలా ప్రాసెసింగ్ కేంద్రం ప్రారంభం