Tuesday, 14 July 2026
  • Home  
  • మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన
- News - ఆంధ్రప్రదేశ్ - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన

ప్రత్యేక వైద్య సేవలు అందించిన నిపుణుల బృందం ఆత్మకూరు, జూలై 13 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి సహకారంతో సోమవారం ఆత్మకూరులో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. కిమ్స్ హాస్పిటల్ నెల్లూరు , ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రి ,అభిరామ్ హాస్పిటల్ , బుచ్చిరెడ్డిపాలెం హోమియోపతి వైద్య బృందం, విరువూరు ఆయుష్ మెడికల్ క్యాంపు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.ఈ మెగా వైద్య శిబిరంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, కిమ్స్ హాస్పిటల్‌కు చెందిన వివిధ విభాగాల నిపుణులు పాల్గొని రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సూచనలు అందించారు. ముఖ్యంగా న్యూరాలజీ, కార్డియాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, మానసిక ఆరోగ్యం, చిన్నపిల్లల వైద్యం, షుగర్, బీపీ వంటి అనేక విభాగాలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు.శిబిరంలో పాల్గొన్న వైద్యులు రోగులను పూర్తిస్థాయిలో పరీక్షించి, వారి ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా చికిత్సా సూచనలు చేశారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలని సూచించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు డిపో మేనేజర్ ఎం. శివకేష్ యాదవ్, అసిస్టెంట్ మేనేజర్ సీహెచ్ రాజ్‌కుమార్, మెకానికల్ సూపర్‌వైజర్ బాబూరావు పాల్గొన్నారు. అలాగే కిమ్స్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ సాయినాథ్ (న్యూరాలజిస్ట్), డాక్టర్ రాకేష్ వంశీ (యూరాలజిస్ట్), డాక్టర్ రేష్మ (మానసిక వైద్య నిపుణులు), డాక్టర్ ప్రణయ్ కుమార్ (జనరల్ ఫిజీషియన్), డాక్టర్ అఖిల్ (శిశు వైద్య నిపుణులు)తో పాటు ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్ విభాగాల వైద్యులు, వైద్య సిబ్బంది సేవలందించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు చేరవేయాలనే ఉద్దేశంతో ఈ మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స పొందడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని పేర్కొన్నారు.శిబిరానికి వచ్చిన ప్రజలు వైద్య పరీక్షలు చేయించుకుని నిపుణుల సలహాలు పొందడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను తరచూ నిర్వహించాలని కోరారు. నిర్వాహకులు, వైద్య బృందం, సహకరించిన సిబ్బందికి స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రత్యేక వైద్య సేవలు అందించిన నిపుణుల బృందం

ఆత్మకూరు, జూలై 13 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి సహకారంతో సోమవారం ఆత్మకూరులో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. కిమ్స్ హాస్పిటల్ నెల్లూరు , ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రి ,అభిరామ్ హాస్పిటల్ , బుచ్చిరెడ్డిపాలెం హోమియోపతి వైద్య బృందం, విరువూరు ఆయుష్ మెడికల్ క్యాంపు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.ఈ మెగా వైద్య శిబిరంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, కిమ్స్ హాస్పిటల్‌కు చెందిన వివిధ విభాగాల నిపుణులు పాల్గొని రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సూచనలు అందించారు. ముఖ్యంగా న్యూరాలజీ, కార్డియాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, మానసిక ఆరోగ్యం, చిన్నపిల్లల వైద్యం, షుగర్, బీపీ వంటి అనేక విభాగాలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు.శిబిరంలో పాల్గొన్న వైద్యులు రోగులను పూర్తిస్థాయిలో పరీక్షించి, వారి ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా చికిత్సా సూచనలు చేశారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలని సూచించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆత్మకూరు డిపో మేనేజర్ ఎం. శివకేష్ యాదవ్, అసిస్టెంట్ మేనేజర్ సీహెచ్ రాజ్‌కుమార్, మెకానికల్ సూపర్‌వైజర్ బాబూరావు పాల్గొన్నారు. అలాగే కిమ్స్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ సాయినాథ్ (న్యూరాలజిస్ట్), డాక్టర్ రాకేష్ వంశీ (యూరాలజిస్ట్), డాక్టర్ రేష్మ (మానసిక వైద్య నిపుణులు), డాక్టర్ ప్రణయ్ కుమార్ (జనరల్ ఫిజీషియన్), డాక్టర్ అఖిల్ (శిశు వైద్య నిపుణులు)తో పాటు ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్ విభాగాల వైద్యులు, వైద్య సిబ్బంది సేవలందించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు చేరవేయాలనే ఉద్దేశంతో ఈ మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స పొందడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని పేర్కొన్నారు.శిబిరానికి వచ్చిన ప్రజలు వైద్య పరీక్షలు చేయించుకుని నిపుణుల సలహాలు పొందడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను తరచూ నిర్వహించాలని కోరారు. నిర్వాహకులు, వైద్య బృందం, సహకరించిన సిబ్బందికి స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.