రాజన్న సిరిసిల్ల ఆగస్ట్ 3 ( పున్నమి ప్రతినిధి)
ముస్తాబాద్ మండల గ్రామపంచాయతీ భవనానికి వేసిన రంగుల అంశం రాజకీయంగా వేడెక్కింది. ప్రభుత్వ భవనానికి ఏ రంగులు వేయాలనే విషయంపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. గ్రామపంచాయతీ తీర్మానం చూపించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు భవనం ఎదుట బైఠాయించారు. అర్ధరాత్రి కాషాయ రంగులు ఎవరు వేశారనే ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనతో ప్రభుత్వ భవనం రాజకీయ రంగస్థలంగా మారిందంటూ స్థానికంగా తీవ్ర చర్చ సాగుతోంది.



