Monday, 8 June 2026
  • Home  
  • రేణుకుంట్ల మురళి కి అరుదైన ఘన సత్కారం
- జనగాం

రేణుకుంట్ల మురళి కి అరుదైన ఘన సత్కారం

ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలలో ఘన సత్కారం పొందిన రేణుకుంట్ల మురళి ————————————- జనగామ, జూన్ 8,పున్నమి ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో చైతన్య సరస్వత పరిషత్ మరియు శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో 6, 7 తేదీలలో ఏడవ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలకు రావలసిందిగా నిర్వాహకులు జనగామ జిల్లా జనగామ పట్టణానికి చెందిన రిటైర్డ్ ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం,ప్రముఖ అంతర్జాతీయ ఇంగ్లీష్ పోయెట్ మరియు తెలుగు కవి, రచయిత, గాయకుడు విశ్వంభర సాహిత్య సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, సనత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ & సానా వితాయస్ సైకోలాజికల్ కౌన్సిలింగ్ సెంటర్ డైరెక్టర్ రేణుకుంట్ల మురళిని ఆహ్వానించడం జరిగింది. రాజమండ్రిలో జరిగిన ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలో పాల్గొని “కుల వివక్షత “అనే అంశంపై చాలా చక్కని కవిత గానం చేసి పలువురి ప్రశంసలు పొందడం జరిగింది.తెలుగు భాషా ద్వారా తెలుగు సాహిత్యాన్ని తెలుగు సాంస్కృతిక వైభవాలను ప్రపంచ వేదికపై ప్రతిధ్వనింపజేసినందుకు నిర్వాహకులు మురళి ని జ్ఞాపిక పూలదండ శాలువాలతో ఘనంగా సత్కరించి ప్రశంస పత్రం అందజేయడం జరిగింది.మురళి మీడియా తో మాట్లాడుతూ గతంలో మూడు వేలకు పైగా ప్రశంస పత్రాలు, అనేక అవార్డులు, రివార్డ్ లు పొందడం జరిగిందని తెలిపారు.ఈ సాహిత్య కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా ఏపీ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినీ మటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్,పలు విద్యాసంస్థలకు మరియు గైట్ యూనివర్సిటీ అధినేత మాజీ ఎమ్మెల్సీ చైతన్య రాజు,సీనియర్ నాయకులు జ్యోతుల నెహ్రూ శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ కత్తిమండ ప్రతాప్, జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి భూషణం జాతీయ కన్వీనర్ డాక్టర్ పార్థసారథి ఎమ్మెల్సీ సోము, ఇరు పొరుగు రాష్ట్రాల నుండి రెండు వేలకు పైగా కవులు, కళాకారులు, రచయితలు మరియు కార్యక్రమ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలలో ఘన సత్కారం పొందిన రేణుకుంట్ల మురళి
————————————-
జనగామ, జూన్ 8,పున్నమి ప్రతినిధి :
ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో చైతన్య సరస్వత పరిషత్ మరియు శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో 6, 7 తేదీలలో ఏడవ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలకు రావలసిందిగా నిర్వాహకులు జనగామ జిల్లా జనగామ పట్టణానికి చెందిన రిటైర్డ్ ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం,ప్రముఖ అంతర్జాతీయ ఇంగ్లీష్ పోయెట్ మరియు తెలుగు కవి, రచయిత, గాయకుడు విశ్వంభర సాహిత్య సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, సనత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ & సానా వితాయస్ సైకోలాజికల్
కౌన్సిలింగ్ సెంటర్ డైరెక్టర్ రేణుకుంట్ల మురళిని ఆహ్వానించడం జరిగింది.
రాజమండ్రిలో జరిగిన ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలో పాల్గొని “కుల వివక్షత “అనే అంశంపై చాలా చక్కని కవిత గానం చేసి పలువురి ప్రశంసలు పొందడం జరిగింది.తెలుగు భాషా ద్వారా తెలుగు సాహిత్యాన్ని తెలుగు సాంస్కృతిక వైభవాలను ప్రపంచ వేదికపై ప్రతిధ్వనింపజేసినందుకు నిర్వాహకులు మురళి ని జ్ఞాపిక పూలదండ శాలువాలతో ఘనంగా సత్కరించి ప్రశంస పత్రం అందజేయడం జరిగింది.మురళి మీడియా తో మాట్లాడుతూ గతంలో మూడు వేలకు పైగా ప్రశంస పత్రాలు, అనేక అవార్డులు, రివార్డ్ లు పొందడం జరిగిందని తెలిపారు.ఈ సాహిత్య కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా ఏపీ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినీ మటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్,పలు విద్యాసంస్థలకు మరియు గైట్ యూనివర్సిటీ అధినేత మాజీ ఎమ్మెల్సీ చైతన్య రాజు,సీనియర్ నాయకులు జ్యోతుల నెహ్రూ శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ కత్తిమండ ప్రతాప్, జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి భూషణం జాతీయ కన్వీనర్ డాక్టర్ పార్థసారథి ఎమ్మెల్సీ సోము, ఇరు పొరుగు రాష్ట్రాల నుండి రెండు వేలకు పైగా కవులు, కళాకారులు, రచయితలు మరియు కార్యక్రమ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.