జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్*
తిరుపతి, ఆగష్టు 03 (పున్నమి ప్రతినిధి)
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి జి ఆర్ ఎస్) కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి జి ఆర్ ఎస్) కు వచ్చిన అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీల ఏర్పాటుతో, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులకు త్రాగునీటి సౌకర్యం, మెడికల్ క్యాంప్, గ్రామాల నుండి వచ్చు అర్జీదారులకు టి సరఫరా తదితర సౌకర్యాలను కల్పించి వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్భంగా పీ జి ఆర్ ఎస్ లో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు. పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఎ ఓపెనింగ్ లేకుండా అర్జిదారుడు సంతృప్తి చెందేలా అర్జీలకు పరిష్కారం చూపాలన్నారు. పీ జి ఆర్ ఎస్ లో వచ్చు అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు, జిల్లా రెవిన్యూ అధికారి నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కల్లెక్టర్లు శివశంకర్ నాయక్, భరత్ నాయక్, నాగార్జున లతో కలసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి, ఆన్లైన్ నమోదుతో సిబ్బంది రసీదులు అందించారు.
*శాఖల వారీగా అర్జీల వివరాలు:* రెవిన్యూ – 176, పంచాయితీ రాజ్ -30, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్- 16, రూరల్ పావర్టి- 14, పోలీస్ -13, జల వనరులు -5, స్వర్ణ గ్రామం /స్వర్ణ వార్డు -5, సర్వే శాఖ- 5, స్కూల్ ఎడ్యుకేషన్ -4, రెసిడెన్షియల్ స్కూల్స్ -4, రూరల్ డెవలప్ మెంట్ -4, సివిల్ సప్లైస్ -3, గనులు మరియు భూగర్భ జలాల శాఖ -3, విద్యుత్ శాఖ -3 , హౌసింగ్- 3, గ్రామీణ నీటి సరఫరా ఇంజనీరింగ్ శాఖ -3, ఆర్ అండ్ బి- 3, ఎండోమెంట్ -3, ఆర్టిసి -3, మత్స్య శాఖ- 2, పరిశ్రమల శాఖ -2, వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ- 2, సోషల్ వెల్ఫేర్ -1, తుడా- 1, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు- 1, స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్- 1, చెరుకు పరిశ్రమ- 1, పబ్లిక్ హెల్త్ -1, అటవీ శాఖ- 1, మహిళా శిశు సంక్షేమ శాఖ- 1, సమగ్ర శిక్ష- 1, వ్యవసాయ శాఖ- 1, రిజిస్ట్రేషన్ శాఖ- 1 మొత్తం 317 అర్జీలు రావడం జరిగిందని, సంబంధిత అధికారులు అందరు సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరయిన వివిధ శాఖలకు సంబందించిన జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
————————————–
డి.ఐ.పి.ఆర్.ఓ. తిరుపతి




