‘
45 డిగ్రీల వేడి లో కావలిలో శుక్రవారం ‘వెన్నుపోటు’ పాలనకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ నిరసన ర్యాలీలో క్యాడర్ కేక పుట్టించింది., వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుండి ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్ వరకు రాజశేఖర్ రెడ్డి విగ్రహం మీదగా సాగిన ఈ ర్యాలీలో వేలాదిగా తరలివచ్చిన నిరుద్యోగులు, రైతులు, శ్రేణులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. కావలిలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సూపర్ సిక్స్, ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సులు, నిరుద్యోగ భృతి, తల్లికి వందనం వంటి ఎన్నికల వాగ్దానాలన్నింటినీ చంద్రబాబు పూర్తిగా విస్మరించారని, అన్నదాత సుఖీభవ పథకంలో కోతలు విధిస్తూ రైతులకు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. 20 లక్షల ఉద్యోగాల పేరిట యువతను వంచించడమే కాకుండా, తన పుట్టినరోజున డీఎస్సీ పోస్టులను అమ్ముకుని చంద్రబాబు నిరుద్యోగులను ఘోరంగా మోసం చేశారని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా కొరత, యాప్ తిప్పలతో రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, గత జగన్ మోహన్ రెడ్డి పాలనలో రైతు భరోసా కేంద్రాలు , ఈ-క్రాప్, మరియు పీఎం ఏ పి పి యాప్ ద్వారా లభించిన స్వర్ణయుగం నేడు కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న జరిగిన డీఆర్సీ సమావేశంలో ప్రజా సమస్యలను పక్కనపెట్టి ప్రభుత్వ ఆస్తులకు తమ కుటుంబ సభ్యుల పేర్లు పెట్టుకోవడంపైనే కూటమి నాయకులు చర్చించారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధిని గాలికి వదిలేసి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలు చేయడమే పనిగా పెట్టుకుందని, వీరికి సహకరిస్తున్న అధికారులకు రాబోయే రోజుల్లో తమ ప్రభుత్వం రాగానే గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లను దృష్టిలో ఉంచుకుని కార్యకర్తలంతా కష్టపడి పనిచేయాలని పిలుపునిస్తూ, పార్టీ జెండా మోసిన ప్రతి ఒక్కరినీ గుండెల్లో పెట్టుకుంటామని ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. భారీగా పుట్టినరోజు రోజు వేడుకలు నిర్వహించిన పది రోజులకు నిర్వహించిన బైక్ ప్రదర్శన కు భారీ స్పందన లభించడంతో పార్టీ వర్గాలలో నూతనోత్సాహం నెలకొంది.

వెన్నుపోటు’ పాలనపై కావలిలో భారీ నిరసన ర్యాలీ. 45 డిగ్రీల వేడి లో క్యాడర్ కేక
‘ 45 డిగ్రీల వేడి లో కావలిలో శుక్రవారం ‘వెన్నుపోటు’ పాలనకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ నిరసన ర్యాలీలో క్యాడర్ కేక పుట్టించింది., వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుండి ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్ వరకు రాజశేఖర్ రెడ్డి విగ్రహం మీదగా సాగిన ఈ ర్యాలీలో వేలాదిగా తరలివచ్చిన నిరుద్యోగులు, రైతులు, శ్రేణులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. కావలిలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సూపర్ సిక్స్, ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సులు, నిరుద్యోగ భృతి, తల్లికి వందనం వంటి ఎన్నికల వాగ్దానాలన్నింటినీ చంద్రబాబు పూర్తిగా విస్మరించారని, అన్నదాత సుఖీభవ పథకంలో కోతలు విధిస్తూ రైతులకు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. 20 లక్షల ఉద్యోగాల పేరిట యువతను వంచించడమే కాకుండా, తన పుట్టినరోజున డీఎస్సీ పోస్టులను అమ్ముకుని చంద్రబాబు నిరుద్యోగులను ఘోరంగా మోసం చేశారని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా కొరత, యాప్ తిప్పలతో రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, గత జగన్ మోహన్ రెడ్డి పాలనలో రైతు భరోసా కేంద్రాలు , ఈ-క్రాప్, మరియు పీఎం ఏ పి పి యాప్ ద్వారా లభించిన స్వర్ణయుగం నేడు కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న జరిగిన డీఆర్సీ సమావేశంలో ప్రజా సమస్యలను పక్కనపెట్టి ప్రభుత్వ ఆస్తులకు తమ కుటుంబ సభ్యుల పేర్లు పెట్టుకోవడంపైనే కూటమి నాయకులు చర్చించారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధిని గాలికి వదిలేసి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలు చేయడమే పనిగా పెట్టుకుందని, వీరికి సహకరిస్తున్న అధికారులకు రాబోయే రోజుల్లో తమ ప్రభుత్వం రాగానే గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లను దృష్టిలో ఉంచుకుని కార్యకర్తలంతా కష్టపడి పనిచేయాలని పిలుపునిస్తూ, పార్టీ జెండా మోసిన ప్రతి ఒక్కరినీ గుండెల్లో పెట్టుకుంటామని ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. భారీగా పుట్టినరోజు రోజు వేడుకలు నిర్వహించిన పది రోజులకు నిర్వహించిన బైక్ ప్రదర్శన కు భారీ స్పందన లభించడంతో పార్టీ వర్గాలలో నూతనోత్సాహం నెలకొంది.

