ఖమ్మం జులై
(పున్నమి న్యూస్)
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏళ్లుగా కొనసాగుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినీతి వ్యవహారాలపై మున్సిపల్ కమిషనర్ అభిషేక్ ఆగస్త్య కఠిన చర్యలు చేపట్టినట్లు సమాచారం. డీజిల్ బంక్ బిల్లుల అక్రమాలకు సంబంధించిన వ్యవహారంలో అసిస్టెంట్ కమిషనర్ అనిల్‌తో పాటు పలువురు సిబ్బందిని సస్పెండ్ చేసి, పోలీసు కేసు నమోదు చేసినట్లు తెలిసింది.
అలాగే విధులకు గైర్హాజరయ్యే ఉద్యోగులపై నియంత్రణ కోసం ఫేస్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని అమలు చేస్తున్నారు. మరోవైపు, కార్పొరేషన్ పరిధిలో సుమారు రూ.100 కోట్ల విలువైన అభివృద్ధి పనుల నాణ్యతపై కమిషనర్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని సమాచారం.
ఈ పరిణామాలతో మున్సిపల్ కార్పొరేషన్‌లో ఉద్యోగులు, అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని, కమిషనర్ తీసుకుంటున్న చర్యలు చర్చనీయాంశంగా మారాయని తెలుస్తోంది.



