అల్లూరి జిల్లా అరకు వ్యాలీ మండలం గెన్నెల పంచాయతీ ఆర్.కె. నగర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ముందస్తు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హెలిపేడ్, ప్రజావేదిక, భద్రతా చర్యలు, ట్రాఫిక్ మళ్లింపు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించి తగు సూచనలు చేశారు.
ఏర్పాట్ల పరిశీలన అనంతరం కలెక్టర్ గ్రామ ప్రజలతో మాట్లాడి తాగునీరు, రహదారులు, విద్యుత్ సరఫరా వంటి మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. స్థానికుల సమస్యలపై సానుకూలంగా స్పందించి వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.



