తిరుచానూరు, ఆగస్టు 28 పున్నమి ప్రతినిధి
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆలపాటి గిరిధర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్ద వారికి ఆలయ సూపరింటెండెంట్ రమేష్, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.


