భైంసా: పున్నమి ప్రతినిధి. సెప్టెంబర్ 07
చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేయడాన్ని భైంసా బీజేపీ టౌన్ అధ్యక్షుడు రావుల రాము తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తోందని ఆయన విమర్శించారు.
విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ, బీజేవైఎం ఆధ్వర్యంలో చేపట్టిన చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమేనని అన్నారు.
బీజేపీ, బీజేవైఎం కార్యక్రమాలకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించిన రావుల రాము, ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీల అమలులో మరింత జాప్యం చేస్తే ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
పోలీసుల అరెస్టులు, హౌస్ అరెస్టులు తమకు కొత్తేమీ కాదని, ఇలాంటి చర్యలతో బీజేపీ శ్రేణులను ఉద్యమాల నుంచి వెనక్కి తగ్గించలేరని రావుల రాము స్పష్టం చేశారు.

ముందస్తు అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు: బీజేపీ మండలం అధ్యక్షులు రావుల రాము గారు
భైంసా: పున్నమి ప్రతినిధి. సెప్టెంబర్ 07 చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేయడాన్ని భైంసా బీజేపీ టౌన్ అధ్యక్షుడు రావుల రాము తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తోందని ఆయన విమర్శించారు. విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ, బీజేవైఎం ఆధ్వర్యంలో చేపట్టిన చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమేనని అన్నారు. బీజేపీ, బీజేవైఎం కార్యక్రమాలకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించిన రావుల రాము, ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీల అమలులో మరింత జాప్యం చేస్తే ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పోలీసుల అరెస్టులు, హౌస్ అరెస్టులు తమకు కొత్తేమీ కాదని, ఇలాంటి చర్యలతో బీజేపీ శ్రేణులను ఉద్యమాల నుంచి వెనక్కి తగ్గించలేరని రావుల రాము స్పష్టం చేశారు.

