సంగం మండలం పెరమన సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగం ఎస్సై భోజ్యా నాయక్ మానవత్వం చాటుకున్నారు.ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు.గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి పంపించడమే కాకుండా,మిగిలిన బాధితులు, చిన్నారులను తన పోలీసు వాహనంలో సంగం పీహెచ్‌సీకి తరలించి వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు. బాధితులకు అండగా నిలిచిన ఎస్సై భోజ్యా నాయక్ సేవా భావంపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.



