రామచంద్రాపురం ఆగస్టు 12 పున్నమి ప్రతినిధి
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ని తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో మండల విద్యార్థి విభాగం నాయకుడు కె గిరీష్ రెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల చంద్రగిరి నియోజకవర్గంలో మెగా డియస్సీ లో జరిగిన అవకతవకులపై నిర్వహించిన నిరాహార దీక్షలు, భారీ ర్యాలీలు, నిరసన కార్యక్రమాల పై మాజీ ముఖ్యమంత్రి కి వివరించినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని విద్యార్థి సమస్యలు తాజా రాజకీయ పరిస్థితులపై మాట్లాడామన్నారు.


