ఖమ్మం జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు మంద సరస్వతి ఆధ్వర్యంలో ఖమ్మంలో జిల్లా మహిళా మోర్చా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు, వరంగల్ జిల్లా ఇన్చార్జి కొండపల్లి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి గుప్త వెంకటేశ్వరరావు, రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు పమ్మి అనిత, సీనియర్ నాయకులు సుబ్బారావు హాజరై దిశానిర్దేశం చేశారు. మంద సరస్వతి మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహిళా సమస్యలపై నిరంతరం పోరాడతామన్నారు. కార్యక్రమంలో మన్నెం నాగమణి, గడ్డం భవాని, నీరుకొండ ఉషారాణి, మేడేపల్లి నీలిమ, వసంత, గోలి ఫణికుమారి, సుందర స్వర్ణ, స్వాతి, సంగీత, మారుతి విశాలి, సీత, మారుతి భార్గవి, నాగమణి, ధనమ్మ, జయశ్రీ, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.



