అరకులోయ లో జన విజ్ఞాన వేదిక (JVV) ఆధ్వర్యంలో చెకుముకి మండల స్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్ శుక్రవారం విజయవంతంగా నిర్వహించారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, తార్కిక ఆలోచన, పరిశీలనా శక్తిని పెంపొందించడమే లక్ష్యంగా పరీక్ష నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన MEO–2 వి. త్రినాథ్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి విషయాన్ని ప్రశ్నిస్తూ, పరిశీలిస్తూ ఆధారాలతో నిజానిజాలను తెలుసుకునే అలవాటు పెంచుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి. మోహన్రావు విద్యార్థులను అభినందించారు. పాఠశాల స్థాయిలో 8, 9, 10 తరగతుల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు మండల స్థాయి పరీక్షలో పాల్గొన్నారు. ముగ్గురు విద్యార్థులు ఒకే సమాధాన పత్రంపై పరస్పరం చర్చించుకుంటూ సమాధానాలు రాశారు. పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు, JVV ప్రతినిధులు పాల్గొన్నారు.

అరకు: చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ విజయవంతం