మహిళల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం కల్పించడంతో పాటు గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీసు శాఖ కఠిన చర్యలు చేపట్టాలని నాని యువసేన నాయకుడు కుర్ర రంగా నాయక్ నాని కోరారు. ప్రతి పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయంలో మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పేద ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటి పరిష్కారం కోసం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. అవినీతి నిర్మూలన, ప్రజాసేవే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ మీడియా మిత్రులు, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

మహిళల భద్రత, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు అవసరం: కుర్ర రంగా నాయక్ నాని