ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 16 ( పున్నమి ప్రతినిధ
మనుబోలు మండల కేంద్రంలోని పద్మావతి కళ్యాణమండపంలో బుధవారం సర్వేపల్లి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీమతి కాకాణి పూజిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కంపేట వైఎస్సార్సీపీ నాయకులు దండు అమర్నాథరెడ్డి వారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. పార్టీ బలోపేతం, స్థానికంగా కార్యకర్తల సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై నాయకులు చర్చించారు. సమావేశానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

మనుబోలులో వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశం
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 16 ( పున్నమి ప్రతినిధ మనుబోలు మండల కేంద్రంలోని పద్మావతి కళ్యాణమండపంలో బుధవారం సర్వేపల్లి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీమతి కాకాణి పూజిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కంపేట వైఎస్సార్సీపీ నాయకులు దండు అమర్నాథరెడ్డి వారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. పార్టీ బలోపేతం, స్థానికంగా కార్యకర్తల సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై నాయకులు చర్చించారు. సమావేశానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

